Event Details

post

శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీ జోగులాంబా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వాగతం - సుస్వాగతం.

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న మహాశక్తి క్షేత్రం అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారు

శ్రీ మహాకాళి
శ్రీ మహాలక్ష్మి,
శ్రీ మహాసరస్వతి ల త్రిశక్తి స్వరూపంతో వెలసిన జగన్మాత లోకపావని అయిన అలంపురము శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 30 2025 గురువారం నుండి మొదలుకొని ఫిబ్రవరి 3 2025 సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును.వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 3 2025 సోమవారం మాఘ శుద్ధ పంచమి అనగా వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ అమ్మవారికి విశేషంగా సహస్ర ఘటాలతో మంగళ ద్రవ్యాలతో అర్చక స్వాముల పర్యవేక్షణలో అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ జోగులాంబ సమేత శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లకు శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును.

సంవత్సరానికి ఒక్కమారు అమ్మవారికి విశేషముగా నిర్వహించే అభిషేక కార్యక్రమములో అత్యంత అరుదుగా శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకూ భక్తులు స్వయంగా కనులారా దర్శించుకునే సదావకాశాన్ని దేవస్థానం వారు కల్పించి ఉన్నారు.

కావున భక్తులందరూ శ్రీ అమ్మవారి యొక్క నిజరూపాన్ని దర్శించి శ్రీ స్వామి అమ్మవార్ల యొక్క విశేష అనుగ్రహాన్ని పొందగలరు.

ఆహ్వానించువారు -
కార్య నిర్వహణ అధికారి, చైర్మన్ మరియు ధర్మ కర్తల మండలి , శ్రీ జోగులాంబా బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము , అలంపురము.

Share